Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడ్కోలు పరేడ్‌లో మహేందర్‌రెడ్డి వ్యాఖ్య
- మహేందర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తా: కొత్త డీజీపీ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పోలీసు శాఖ సేవలు ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశాననీ, ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడిందని రిటైరవుతున్న డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హిమాయత్‌సాగర్‌లోని అప్పాలో రిటైర్ అవుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి వీడ్కోలు పరేడ్ జరిగింది. సాయుధ పోలీసు బలగాలు పరేడ్ చేస్తూ మహేందర్‌రెడ్డికి గౌరవ వందనాన్ని సమర్పించాయి. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన సమయంలో మతకలహాలు జరుగుతాయనీ, ఉగ్రవాద దాడులు జరుగుతాయనీ, నక్సలైట్లు చెలరేగుతారని అంటు అనేక సందేహాలు, భయాలను నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయనీ, కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో పోలీసు శాఖను బలోపేతం చేయడానికి తీసుకున్న పలు చర్యలు, పోలీసుల కృషి వెరసి రాష్ట్రం అలాంటి సందేహాలను పటాపంచలు చేసిందని ఆయన సగర్వంగా తెలిపారు. ముఖ్యంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పోలీసు సేవలు ప్రజల వద్దకు చేరడానికి దోదపడిందని తెలిపారు. తన 36 ఏండ్ల పోలీసు సర్వీసులో అనేక పరిణామాలు ఎదరురైనప్పటికీ ప్రజల సహాకారం, ప్రభుత్వాల తోడ్పాటు, సన్నిహితుల సూచలనతో వాటన్నింటిని సులువుగా గెట్టక్కానని ఆయన తెలిపారు.
డీజీపీగా తాను తీసుకున్న పలు నిర్ణయాల వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహాకారం ఎంతగానో ఉందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రం శాంతి భద్రతల పరంగా సవ్యంగా ఉంచడం ద్వారా కోట్లాది రూపాయల పెట్టుడులను రాష్ట్రానికి వచ్చేలా చూడగలిగామని తెలిపారు. ఇందుకు పోలీసు శాఖకు అవసరమైన మౌళిక సదుపాయాలు, వాహనాలు, దాదాపు ముప్పై వేలకు పైగా సిబ్బంది, అధికారులను సమకూర్చడం ద్వారా సీఎం కేసీఆర్ ఎంతగానో తోడ్పడ్డారని ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కొత్తగా డీజీపీగా నియమించబడ్డ అంజనీకుమార్ సైతం సమర్థుడైన ఐపీఎస్ అధికారి అనీ, ఆయన హయాంలో సైతం రాష్ట్ర పోలీసు శాఖ మరింత పేరును సంపాదించగలదని అన్నారు.
నూతన డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ మహేందర్‌రెడ్డి హయాంలో రాష్ట్ర పోలీసు శాఖ మునుపెన్నడు లేని విధంగా ప్రతిష్టను పెంచుకుందన్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడు లేని విధంగా దూర దృష్టితో ఆయన ప్రవేశ పెట్టిన సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు అనేక అధ్బుతాలు సాధించారని కొనియాడారు. తాను సైతం ఆయన అడుగు జాడల్లో నడుస్తు పోలీసు శాఖకు మరింత పేరును తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. మహేందర్‌రెడ్డితో పాటు పని చేసే అవకాశం రావడం తన అదృష్టంగా ఆయన చెప్పారు.