Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రానైట్ రాళ్లు ఆటో మీద పడటంతో ఇద్దరు మృతి
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం శివారు అయ్యవారిపెళ్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను గ్రానైట్ లారీ ఢకొీట్టడంతో బండరాళ్లు మీద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో మహబూబాదాద్ వైపు నుంచి భారీ బండరాళ్లతో గ్రానైట్ లారీ మరిపెడ వైపు వెళ్తోంది. ఎదురుగా వస్తున్న ఆటోను ఢకొీట్టింది. దీంతో గ్రానైట్ రాళ్ల తాళ్లు తెగి రాళ్లు ఆటోపై పడ్డాయి. ఆ సమయంలో ఆటోలో డ్రైవర్‌తోపాటు ఎనిమిది మంది ఉన్నారు. రాళ్లు మీద పడటంతో బానోత్ సుమన్(35), యెక్కలపు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన డెన్యాల నవీన్‌ను వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. లింగంపల్లి రాంబాబు, బానోతు రాము, ఆటో డ్రైవర్ బానోత్ రమేష్, నావత్ వీరన్న, బొడ్డు శేఖర్‌ను మానుకోట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం నుంచి వారంతా మహబూబాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బండరాళ్ల కింద ఇంకెవరన్న ఉండొచ్చన్న అనుమానాలున్నాయి.