Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త సంవత్సర వేడుకల్లో
- నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ సుధాభాస్కర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నవతెలంగాణ పత్రిక ఎన్నో సవాళ్లు, కష్టాలు, నష్టాలను ఎదుర్కొని నిలబడిందనీ, భవిష్యత్లో మరిన్ని రావచ్చనీ, ఎదుర్కునేందుకు సిద్ధం కావాలని నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ పి. ప్రభాకర్, ఎడిటర్ ఆర్. సుధాభాస్కర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎంహెచ్ భవన్లో నూతన సంవత్సరం 2023 వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా సీజీఎం, ఎడిటర్ కేక్ కట్ చేశారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ మన పత్రికకు కష్టాలు కొత్తకాదనీ, అన్నింటీని తట్టుకుని పత్రికను నిలబెట్టుకున్నామని చెప్పారు. ఇందులో ఉద్యోగులు, సిబ్బంది పాత్ర గొప్పదని అభినందించారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతలను మరింత పకడ్బంధిగా నిర్వర్తించడం ద్వారా పత్రికను మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. దేశంలో మతోన్మాద ప్రభావం పెరుగుతున్నదనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమేరకు పాఠకులు, ప్రజలను చైతన్యం చేసేలా కృషిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ బుకహౌజ్ ఎడిటర్ పి.ఆనందాచారి, జనరల్ మేనేజర్ పి.లింగారెడ్డి, చీఫ్ ఫోటోగ్రాఫర్ కె.ఎన్.హరి, స్పెషల్ కరస్పాండెంట్ బి.బసవపున్నయ్య, బ్యూరో చీఫ్ బీవీఎన్ పద్మరాజు, జనరల్ డెస్క్ షిఫ్ట్ ఇన్ఛార్జి కె.లలిత తదితరులు పాల్గొన్నారు.