Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి
నవతెలంగాణ-ఓయూ
డిగ్రీ విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్షలు రాయడానికి నామినల్ ఫీజులు నిర్ణయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ.. డిగ్రీ 2016-17, 18 బ్యాచ్ విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్షలు రాసుకోవడానికి యూనివర్సిటీ అధికారులు చివరి అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే, ఒక్క పేపర్‌కు రూ.10,000 నిర్ణయించడం సరైంది కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బ్యాక్లాగ్ పరీక్షలు రాయడానికి నామినల్(తక్కువ) ఫీజులు చెల్లించే రకంగా నిర్ణయాలు ఉండాలని తెలిపారు. ఈ బ్యాచ్ విద్యార్థులకు కరోనా సమయంలో సంవత్సరం సమయం వృథా అయిందని, చివరి క్షణాల్లో పరీక్ష పెట్టారని చెప్పారు. సరైన సమయానికి పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఇన్ని వేల ఫీజులు చెల్లించలేమని విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారని, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, రవి నాయక్, విద్యార్థులు అరవింద్, శ్రీవాణి, కళ్యాణ్, దివ్య, నాని, యాధులు పాల్గొన్నారు.