Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు
- 87 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
- ఆఫీస్బేరర్లుగా 22 మంది
ఖమ్మం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు ఎన్నికయ్యారు. ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావు(భక్తరామదాసు కళాక్షేత్రం)లోని అమరవీరుల ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్ర మూడో మహాసభలో శనివారం నాడు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త కమిటీలో 87 మంది ఉన్నారు. అందులో 22 మంది ఆఫీస్ బేరర్లుగా ఉండనున్నారు. ఉపాధ్యక్షులుగా తమ్మినేని వీరభద్రం, పొన్నం వెంకటేశ్వరరావు, ములకలపల్లి రాములు, ఎం.ఆంజనేయులు, పెద్ది వెంకట్రాములు, అల్వాల వీరయ్య, లంక రాములు, నర్సింహులు, సమ్మయ్య, కార్యదర్శులుగా పద్మ, నారి అయిలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, కొండమడుగు నర్సింహ్మ, ఎం. వెంకటయ్య, యు.గోపాల్, వెంకటరాజు, కె.జగన్, ఆర్.శశిధర్, సాంబశివ, కో-ఆప్షన్(మహిళ) ఎన్నికయ్యారు. పశ్చిమబెంగాల్లోని హౌరాలో ఫిబ్రవరి 15 నుంచి 18వ తేదీ వరకు జరగబోయే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు కూడా ప్రతినిధులను మహాసభలో ఎన్నుకున్నారు.