Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐపీఏటీ-2022) ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫలితాల్లో శ్రీచైతన్య సంచలనం సృష్టించింది. అత్యధికంగా వంద సెలక్షన్లు సాధించి సత్తా చాటింది. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్ఈ) ఫిజిక్స్‌లో 27 సెలక్షన్లు, కెమిస్ట్రీలో 30 సెలక్షన్లు, బయాలజీలో రెండు సెలక్షన్లు, ఆస్ట్రానమీలో 30 సెలక్షన్లు, మ్యాథ్స్‌లో 11 సెలక్షన్లు మొత్తం వంద సెలక్షన్లు ఒక్క శ్రీచైతన్య విద్యార్థులే సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. అటు బోర్డ్ పరీక్షలతోపాటు పోటీ పరీక్షలు, ఒలింపియాడ్స్‌లోనూ తమ సంస్థ విద్యార్థులే టాపర్లుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లు, నిపుణులైన ఉపాధ్యాయులు, మైక్రో ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ ఈ విజయాలకు కారణమని వివరించారు. ఈ ఒలింపియాడ్‌లో సెలక్షన్లు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక, బోధనేతర సిబ్బందిని శ్రీచైనత్య విద్యాసంస్థల అధినేత బిఎస్ రావు అభినందించారు.