Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 5న ముగియనున్న దేహదారుడ్య పరీక్షలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో దాదాపు 17వేల కానిఐస్టేబుల్, ఎస్సై పోస్టులకు జరుగుతున్న దేహదారుడ్య పరీక్షలు ఈ నెల 5న ముగియనున్నాయి. అలాగే, మార్చి 12 నుంచి తుది పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్పీ) సన్నాహాలు చేస్తున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటించారు. డిసెంబర్ 8 నుంచి కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఈనెల 5న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో దేహదారుడ్య పరీక్షలలో నెగ్గిన అభ్యర్థులకు వెసులుబాటు కోసం తుది పరీక్షల వివరాలను ప్రకటిస్తున్నట్టు బోర్డు చైర్మెన్ వివరించారు.
మార్చి 12 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు గాను అభ్యర్థులకు తుది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 12న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మూడు గంటల పాటు ఎస్సై (ఐటీ అండ్ సీవో) అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఎస్సై(ఫింగర్ ప్రింట్స్ బ్యూరో) అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ ఉంటుంది. మార్చి 26న ఎస్ఐ (పీటీవో) అభ్యర్థులకు 10 నుంచి 1 వరకు టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టీవ్ టైప్‌లో ఉంటుంది. ఇక ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కానిస్టేబుల్ డ్రైవర్, ఆపరేటర్ పోస్టుల అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కానిస్టేబుల్ (మెకానిక్) అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ ఉంటుంది. అలాగే ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎస్సై, ఏఎస్సై అభ్యర్థులకు అర్థమేటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్‌లో పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సై, ఏఎస్సై అభ్యర్థులకు ఇంగ్లీష్ భాషలో పరీక్ష ఉంటుంది. అలాగే ఏప్రిల్ 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎస్సై అభ్యర్థులకు జనరల్ సైన్స్‌లో పరీక్ష ఉంటుంది.
అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఎస్సై అభ్యర్థులకు తెలుగు, ఉర్ధూలో పరీక్ష ఉంటుంది. అలాగే ఏప్రిల్ 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్లకు జనరల్ స్టడీస్‌లో పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కానిస్టేబుల్(ఐటీసీవో) అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష ఉంటుంది.