Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తోటి ఐపీఎస్‌లకు అంజనీకుమార్ పిలుపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో శాంతి భద్రతలను అందరం కలిసి మెలసి కాపాడుతూ, నేరాలను అరికడదామని నూతన డీజీపీ అంజనీకుమార్ తోటి ఐపీఎస్ అధికారులకు పిలుపునిచ్చారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు అధికారుల మెస్‌లో నూతన సంవత్సరం కేక్‌ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమిష్టి కృషితోనే దేనినైనా సాధించగలమని అన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు సవ్యంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాలను అరికట్టగలమనీ, నేరస్తులకు ముకుతాడు వేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, రవిగుప్తా, జితేందర్, శివధర్‌రెడ్డి, సంజరు జైన్, విజరుకుమార్, మహేష్ భగవత్‌లు పాల్గొన్నారు.