Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిథి -హైదరాబాద్
ఎన్టీఆర్ భవన్లో నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కేక్‌ను కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ , యావత్ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సింహగర్జన సభ విజయవంతం కోసం మూడు జిల్లాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. బస్సుయాత్ర ద్వారా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఎప్పుడు ఏ స్థాయి ఎన్నికలు వచ్చినా, రాబోయే ఎన్నికలకు అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సర్వం సన్నద్ధంగా ఉండాలని తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వెళ్లివిరుస్తుందని అన్నారు. రాబోయే రోజులలో మూడు లేదా నాలుగు జిల్లాల్లో భారీ బహిరంగ విజయవంతం కు సభలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.