Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర నూతన డీజీపీ అంజనీకుమార్ ఆదివారం ఉదయం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయన పుష్పగుచ్చమిచ్చారు. అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి గురించి కొద్ది సేపు ఆయన మంత్రికి వివరించారు. హౌంమంత్రిని కలిసిన వారిలో నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కూడా ఉన్నారు.