Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
- మరో రోడ్డు ప్రమాదంలో.. దంపతులు మృతి
నవతెలంగాణ-బంజారాహిల్స్/ కంటోన్మెంట్
కొత్త ఏడాది మొదటి రోజే హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఓ కారు బీఢత్సం సృష్టించడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 5:38 నిమిషాలకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న ఓ కారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద డివైడర్‌ను ఢకొీని అదుపు తప్పింది. ఈ క్రమంలో మరో రెండు కార్లను ఢకొీట్టింది. అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢకొీట్టడంతో వారు గాల్లోకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న ప్రణవ్, వర్ధన్‌ను అరెస్టు చేశారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారిని ఏపీలోని రావులపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, భీమవరానికి చెందిన ఈశ్వరిగా గుర్తించారు. ఈశ్వరీ ఇండ్లలో పనిచేసుకొని జీవనం సాగిస్తుంది. శ్రీనివాస్ పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఇక నిందితలిద్దరూ మణిపాల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. నిందితులు మద్యం తాగి వాహనం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారి రక్త పరీక్షలు చేయించినట్టు తెలిసింది.
కొడుకుని చూడటానికి వచ్చి..
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటనలో కొడుకుని చూడటానికి వచ్చిన వృద్ధ దంపతులను ఆర్టీసీ బస్సు ఢకొీట్టడంతో మృతి చెందారు. వివరాల్లోకెళ్తే.. నిర్మల్ జిల్లా బాకాయిపేట గ్రామానికి చెందిన తులసీదాస్, రాజమణి దంపతులు. గచ్చిబౌలిలో ఉన్న తమ కుమారుడిని చూసేందుకు ఆదివారం వారు నగరానికి వచ్చారు. బోయిన్పల్లి వద్ద బస్సు దిగి మరో బస్సు ఎక్కేందుకు రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా బోయిన్పల్ల్లి కూడలి వద్ద వారిని వేగంగా వచ్చిన జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢకొీట్టింది. దాంతో దంపతులకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్ నరహరిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తన తల్లిదండ్రుల మరణ వార్త విని కుమారుడు శోక సంద్రంలో మునిగిపోయాడు.