Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితునిపై ఫోక్సో కేసు నమోదు
- ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ- తుంగతుర్తి
గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై లైంగికదాడి జరిగింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గురుకులంలో ఆలస్యంగా వెలుగు జూసింది. ఎస్ఐ డానియల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని తుంగతుర్తిలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఒంటెద్దు నాగేందర్‌తో విద్యార్థినికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతను ఆదివారం రాత్రి కళాశాల వద్దకు వచ్చి ఆమెను బయటకు రావాలని కోరాడు. తాను రానని ఆమె నిరాకరిం చడంతో.. బ్లాక్మెయిల్ చేశాడు. 'నీవు రాకుంటే నేను చనిపోతానని' బెదిరించాడు. దాంతో విద్యార్థిని బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆమెను కొట్టి లైంగికదాడికి ఒడిగట్టాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఆమె కళాశాలకు వెళ్లి తనపై జరిగిన దాడి గురించి ప్రిన్సిపాల్ దుర్గాభవానికి చెప్పినా నిర్లక్ష్యం వహించారు. మరుసటి రోజు తల్లిదండ్రులను పిలిపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాగేందర్‌పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ దుర్గాభవాని నిర్లక్ష్యంగా సమాధానం చెబు తుండటంతో.. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురుకులం నుంచి విద్యార్థిని ఎలా బయటకు వెళ్లింది.. నిర్వాహకులు ఏం చేస్తున్నారని ప్రశ్నిం చారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.