Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తిశ్రద్ధలతో ఉత్తరద్వార దర్శనం
నవ తెలంగాణ-సిద్దిపేట
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని మోహింపురలో గల వెంకటేశ్వర దేవాలయంలో సోమవారం సందర్శకులు భక్తిశ్రద్ధలతో ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారి పల్లకీసేవ నిర్వహించారు. దాతలు, మంత్రి సహకారంతో సుమారు రెండు కిలోల బంగారు కిరీటాన్ని ఆలయ కమిటీ చేయించింది. మంత్రి హరీశ్‌రావు బంగారు కిరీటాన్ని స్వామివారికి అందజేశారు. అంతకుముందు మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో విశ్వనాధ శర్మ, చైర్మెన్ అమరేష్ విష్ణు ప్రసాదాలను అందజేశారు. పోలీసులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.