Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ నాటి విద్యార్థి సంఘం నేత ఎం.శ్రీధర్ రెడ్డి మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తొలి, మలి దశల్లో తెలంగాణ ఉద్యమానికి శ్రీధర్ రెడ్డి చేసిన కృషిని స్మరించుకున్నారు. తాను నమ్మిన విలువల కోసం శ్రీధర్‌రెడ్డి కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీధర్‌రెడ్డి మృతిపట్ల టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు, టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. మలి విడత ఉద్యమం లోనూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో శ్రీధర్‌రెడ్డి తనదైన పాత్ర పోషించారని కేకే పేర్కొన్నారు. తనపై ఆయన ప్రభావం ఉందని తెలిపారు.