Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీలు సునీల్ బన్సాల్, తరుణ్‌చుగ్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జీలు, ఐటీ సెల్ కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, పాలక్, ప్రభారీలు, కన్వీనర్లు, విస్తారక్‌లతో వేర్వేరుగా వర్చువల్ సమావేశాలను చేపట్టారు. ఈ నెల ఏడోతేదీన చేపట్టే 34,600 బూత్ కమిటీలకు చెందిన 7,26, 600 మందితో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిర్వహించనున్న వర్చువల్ సమావేశంపై ప్రధానంగా చర్చించారు. పలు సూచనలు చేశారు. సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ మాట్లాడారు. జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్‌కుమార్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శృతి, తదితరులు పాల్గొన్నారు.