Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-పటాన్చెరు
వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమవంతు కృషి చేస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.మల్లికార్జున్‌తో కలిసి తమ్మినేని సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. గతేడాది వీఆర్ఏలు 80 రోజులు సమ్మె చేయగా.. సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సాక్షిగా సీఎం హామీ ఇచ్చారన్నారు. కాగా ఇప్పటివరకు హామీలు నెరవేర్చలేదని.. వాటి అమలుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన తమ్మినేని.. గత నవంబర్‌లో వీఆర్ఏల సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు రవి, లక్ష్మణ్, శ్రీనివాస్, బాల్ రాజ్ వంశీ, జ్యోతి, జయరాజ్, వాజిద్ అలీ, వీఆర్ఏలు పాల్గొన్నారు.