Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫ్రెంచ్ అంతర్జాతీయ ఆటోమోటివ్ సరఫరాదారు ఫోర్వియాకు భారతీయ ఇంటీరియర్ సిస్టమ్స్ వ్యాపారం చేసే ఫౌవేసియాను టఫె సొంతం చేసుకున్నది. ఇటీవల ముగిసిన ఒప్పం దంలో భాగంగా భారతదేశంలో ఆటోమోటివ్ పరి శ్రమకు పూర్తి స్ధాయిలో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఆటోమోటివ్ ఇంజినీర్డ్ ప్లాస్టిక్ విడిభాగాలను అందించే సుప్రసిద్ధ ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్ వ్యాపార సంస్ధగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ ట్రాక్టర్ సంస్ధ అయిన టఫె ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్.. మోబిక్ కియాబీ, మోబిస్-హ్యుందారు, ఫోక్స్‌వేగన్, ఎఫ్సీఏ, టాటా సహా సుప్రసిద్ధ ఆటోమోటివ్ సంస్థలకు సేవలందించే ఫోర్వియా యొక్క భారతీయ ఇంటీరియర్ బిజినెస్ ఫౌవేసియాను సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మహారాష్ట్రలోని చకన్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ మరియు తమిళనాడులో ఉన్న ఫౌవేసియా యూనిట్లు కూడా టఫె వశం కానున్నాయి. టఫె చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ''ఈ విలీనం అందించే శక్తివంతమైన సమన్వయ అవకాశాలతో టఫె మరింత ముందుకెళ్లనున్నది. మా వినియోగదారులతో మా బంధానికి మేము అత్యున్నత సేవలను అందిస్తున్నాం. వారు అందిస్తున్న ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు. డిజైన్‌లో అత్యున్నత నాణ్యత ప్రమాణాల దిశగా మా వినియోగదారులకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటిస్తున్నాను. సాంకేతికత, ఆవిష్కరణ, తయారీ పరంగా శ్రేష్టతలు మా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నాయి'' అని అన్నారు.