Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అడవుల రక్షణ, పచ్చదనం పెంపునే తమ మొదటి ప్రాధాన్యమని పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు. సోమవారం హైదరా బాద్‌లోని అరణ్యభవన్‌లో నూతన సంవత్స రపు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ కేక్ కట్ చేశారు. అటవీ అధికారుల సంఘం రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దతతో వ్యవహరిం చాలని సిబ్బందికి సూచించారు. పచ్చదనం పెంపు నకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, దేశంలో మరే ఇతర రాష్ట్రమూ ఇవ్వటం లేదన్న విషయాన్ని గుర్తించి పనిచేయాలన్నారు. కార్య క్రమంలో అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ఎం.ప్రశాంతి, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఎలూసింగ్ మేరు, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎంసీ. పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ వినరు కుమార్, హైదరాబాద్ డీఎఫ్ఓ ఎం. జోజి, ఇతర ఉన్నతాధి కారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.