Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంంబాసిడరని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. ప్రజలను నిలువునా మోసం చేయడంలో ఆయన దిట్ట అని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు చామల కిరణ్‌రెడ్డి, ప్రీతమ్, నీలిమాతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఎన్నికల్లో దళితులను సీఎం చేస్తామనీ, ఇంటికో ఉద్యోగం, గిరిజన రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి, హుజురాబాద్ ఉపఎన్నికల కోసం దళిత బంధు, మునుగోడు ఉప ఎన్నిక కోసం గోర్ల పంపిణీ చేస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. గొర్లకు బదులు వారి అకౌంట్లలో డబ్బులు జమ చేసి, ఆ తర్వాత అకౌంట్లు ఫ్రీజ్ చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎన్నికలు అయ్యే వరకు ఓ మాట, తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతురుణమాఫీ, ఉచిత ఎరువులు విషయంలో మోసం చేశారని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తాయిలాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ డైరెక్షన్ మేరకే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఆరోపించారు.