Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రయాణీకుల సౌకర్యార్థం రాష్ట్రంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. తొలి విడతగా 4 స్లీపర్, మరో 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులను బుధవారం సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-విజయవాడ మార్గాల్లో ఈ బస్సులు తిరుగుతాయి. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్టాప్ దగ్గర బుధవారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో చైర్మెన్ ఈ బస్సులను ప్రారంభిస్తారు. స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో 15 అప్పర్ బెర్తులతో పాటు లోయర్ లెవల్లో 33 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్‌తో పాటు వైఫై సదుపాయం ఉంటుంది.