Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డొనేషన్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కుల నిర్మూలన వేదిక (కేఎన్వీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను మంగళవారం హైదరాబాద్లో ఆ సంఘం అధ్యక్షులు పాపని నాగరాజు, కార్యదర్శి కోట ఆనంద్, నాయకులు బి నాగేందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. రూ.లక్ష నుంచి రూ.18 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా డొనేషన్లు తీసుకుంటున్నాయని తెలిపారు. మాతృశ్రీ, ఎంవీఎస్ఆర్, శ్రీనిధి, ఎంజీఐటీ, సీబీఐటీ, సీవీఆర్, కేశవ్ మెమోరియల్, వర్ధమాన్, గోకరాజు రంగరాజు, నీయిల్గోటి, మల్లారెడ్డి, సీఎంఆర్, ఏసీఈ, గురునానక్, శ్రేయాస్, శ్రీదేవి, సెయింట్ మార్టిన్, మర్రి లక్ష్మారెడ్డి, గీతాంజలి కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ కాలేజీలపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.