Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్బంది ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత
- తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్
- ప్రారంభించిన ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి యాజమాన్యం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. గతేడాది నవంబర్‌లో 46,340 మంది ఆర్టీసీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న 300 మంది ఉద్యోగుల ప్రాణాలను కాపాడామని చెప్పారు. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో మంగళవారం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన 'కాల్ హెల్త్' సంస్థ ప్రజెంటేషన్‌ను చూశారు. అనంతరం అక్కడే చల్లా చారిటబుల్ ట్రస్ట్, టీఎస్ఆర్టీసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నూతన బ్లడ్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు త్వరలోనే ప్రతి డిపోలో హెల్త్ వాలంటీర్లను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించిన కాల్ హెల్త్ సంస్థ సీఈవో హరి, సీవోవో రత్నేష్, తరుణ్ తదితరులను ఆయన సన్మానించారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అక్కడే అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషిన్‌ను కూడా ప్రారంభించారు. ఆస్పత్రి భవన విస్తరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ అడ్వయిజర్ సైదిరెడ్డి, సీపీఎం కష్ణకాంత్, సీఎఫ్ఎం విజయపుష్ప, ఆర్టీసీ ఆస్పత్రి సూపరింటెండెంట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.