Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకవైపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. మరోవైపు ఆందోళన
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలోని ఈ2 హాస్టల్ మెస్ ప్రారంభించాలంటూ విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కారు. ఒకవైపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తుండగా.. మరోవైపు విద్యార్థులు మెస్ ప్రారంభించాలని రోడ్డుపై రాస్తారోకో చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తమ హాస్టల్ మెస్‌ను ప్రారంభించాలంటూ రెండు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా వేరే హాస్టల్ మెస్ కేటాయించినప్పటికీ, అక్కడ విద్యార్థుల రద్దీతో వారు తిన్న తరువాత తాము తినాల్సి వస్తోందని చెప్పారు. దాంతో తరగతులకు సైతం ఆలస్యమవుతోందని వాపోయారు. అందరు విద్యార్థుల్లా తాము కూడా మెస్ డిపాజిట్ చెల్లించినా ఎందుకు ద్వితీయ శ్రేణి విద్యార్థులుగా చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ హాస్టల్ మెస్‌ను ప్రారంభించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.