Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్‌యూపీపీటీఎస్ నేతలకు మంత్రి హరీశ్‌రావు హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భాషాపండితులకు పదోన్నతులతోపాటే ఇతర ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామంటూ ఆర్‌యూపీపీటీఎస్ నేతలకు ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని ఆర్‌యూపీపీటీఎస్ అధ్యక్షులు సి జగదీశ్ నేతృత్వంలో కలిశారు. భాషాపండితుల అప్‌గ్రెడేషన్‌కు సంబంధించిన కేసులన్నింటినీ ఒకే బెంచ్‌పైకి తెప్పించి స్టేను వెకేట్ చేయించాలని కోరారు.
అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. పండితులకు పదోన్నతులు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. దీనిపై పై విధంగా మంత్రి హరీశ్‌రావు స్పందించారని పేర్కొన్నారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్ ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సిములు, నాయకులు మహవీర్‌సింగ్, గురునాథం, శ్రీరాములు, ప్రవీణ్‌కుమార్, ఇజ్రాయేల్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.