Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజమౌళి పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాల కులు బి రాజమౌళి పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శిం చుకునే ఉద్దేశ్యంతో జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ (65) చేపట్టిన సైకిల్ యాత్రను సమాచార భవన్ నుంచి ఆయన ప్రారంభించారు. అల్వాల్‌కు చెందిన జర్నలిస్టు గౌరీశంకర్ బ్రహ్మచారి. ఆరోగ్యం, పర్యావరణం, పచ్చదనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2000 సంవత్సరం నుండి దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్నట్టు గౌరిశంకర్ తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రోజుకు 60 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయనున్నట్టు వివరించారు. 60 రోజుల పాటు కొనసాగే ఈసైకిల్ యాత్ర ప్రారంభో త్సవంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లీ, సంయుక్త సంచాలకులు డీ యస్ జగన్, డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.