Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటి వరకు ఉన్న రికార్డులు డిజిటలైజేషన్
- సంస్థ కార్యాకాలాపాల్లో పేపర్ వినియోగం తగ్గింపు
- తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ఫుడ్స్ సంస్థ నడుం బిగించింది. చెట్లను నరికి తయారు చేసే పేపర్ వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించినట్టు తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఇప్పటికే సంస్థలో సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టామనీ, అలాగే సంస్ద కార్యాకాలాపాలను డిజిటలైజేషన్ చేసేందుకు నిర్ణయించినట్టు వివరించారు. ఇందు కోసం అంతర్జాతీయ ఎన్జీవో (సాల్ట్ లేక్ సిటీ, అమెరికా) ఫ్యామిలీ సెర్చ్ వారి సహకారంతో ఈ డిజిటల్ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఒక్క సారి సంస్థ రికార్డులు డిజిటల్ లోకి మారితే వంద ఏండ్లైనా అది భద్రంగా ఉంటాయని వివరించారు. తెలంగాణ ఫుడ్స్ సంస్థ ప్రారంభమైన 1976 సంవత్సరం నుంచి ఇప్పటీ వరకు సంస్థకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను డిజిటల్ రూపంలోకి మార్చుతారని తెలి పారు. అలాగే ఇకపై చేపట్టే సంస్థ కార్యాకాలాపాలు సైతం పేపర్ రహితంగా ఉంటడాయని వివరించారు. దీని ద్వారా పర్యావరణాన్ని కొంతైనా కాపాడుగలుగు తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్‌కు దీనికి సంబంధించిన ప్రజంటేషన్ ఇచ్చినట్టు తెలిపారు.