Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు, టీజీవో నేతలు, అధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డి, టీజీవో అధ్యక్షులు వి మమత, ఎంపీడీవోల సంఘం ప్రతినిధులతోపాటు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి మంత్రి ఎర్రబెల్లిని కలిసి వారిలో ఉన్నారు. టీజీవోల క్యాలెండర్, డైరీని, ఎంపీడీవోల డైరీని మంత్రులు ఆవిష్కరించారు. ములుగులో మరిన్ని గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు.