Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల రాష్ట్ర 17వ మహాసభ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ ఫంక్షన్హాల్లో నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులుకోడెపాక కుమారస్వామి, ముత్యంవెంకన్న తెలిపారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారితో పాటు సంఘం నాయకులు జీ బ్రహ్మేంద్రరావు, పి యాదగిరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలో నూతన సంవత్సర డైరీ, కేలండర్ ఆవిష్కరణ జరుగుతుందనీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కష్ణయ్య, టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, రెండు డిస్కంల సీఎమ్‌డీలు, డైరెక్టర్లు పాల్గొంటారని తెలిపారు.