Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో సహకార వ్యవస్థ బలోపేతానికి సెమినార్లు, శిక్షణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, సహకార రంగ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వైకుంత్ మెహతా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్(వామినికామ్)తో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇనిస్టిట్యూట్(ఎన్ఐఆర్డీపీఆర్) ఒప్పందం కుదుర్చు కున్నది. ఈ మేరకు మంగళవారం ఎన్ఐఆర్డీపీఆర్ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్, వామినికామ్ డైరెక్టర్ డాక్టర్ హేమ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా సహకార సంస్థలు, సంఘాలు, స్వయం సహాయక బృందాలకు సామర్ధ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. సమకాలీన సమస్యలపై సెమినార్లు, వర్క్‌షాపులను నిర్వహిస్తారు. గ్రామీణ భారతదేశానికి సంబంధించిన సహకార నిర్వహణ సంబంధిత థీమ్‌లపై అధ్యయనాలను కూడా సంయుక్తంగా చేపట్టనున్నారు. సహకార పరిశోధన, సహకార రంగంలో శిక్షకుల శిక్షణ, పీజీ ప్రోగ్రామ్‌ల కోసం ఫ్యాకల్టీని రెండు సంస్థలూ పరస్పరం వినియోగించుకోనున్నాయి.