Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైళ్ల రాకపోకల్లో భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. జోన్ పరిధిలో రైల్వే భద్రత, సమయపాలన, లోడింగ్ పనితీరుపై మంగళవారంనాడాయన సికింద్రాబాద్ రైల్‌నిలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు జనరల్ మేనేజర్ పీ ఉదరుకుమార్రెడ్డితో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ సహా ఆరు డివిజన్లకు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన సిగల్స్ వద్ద లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, రన్నింగ్ సిబ్బందిని క్రమం తప్పకుండా కౌన్సిల్ చేయాలనీ, షార్ట్కట్లు వెతకొద్దనీ చెప్పారు. దానికోసం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని అదేశించారు. మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయపాలనను మెరుగుపర్చాలని సూచించారు. నాన్ ఇంటర్‌లాకింగ్ వర్కింగ్‌పై దష్టి పెట్టాలన్నారు. గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపర్చేందుకు సాధ్యమైన చోట్ల వేగనియంత్రణ సూచనలను తీసివేయాలని చెప్పారు. సిమెంట్,ఆహార ధాన్యాల, బొగ్గుతో పాటు ఇతర వస్తువుల లోడింగ్‌పై సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలో జరుగుతున్న డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ, సిగలింగ్ ఏర్పాట్ల పురోగతిపైనా చర్చించారు.