Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గోదావరి వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సహాయం అందించక పోవడంపై ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ను వైఎస్ఆర్ టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అకాల వర్షాలకు గోదారి ఉగ్రరూపం దాల్చినప్పుడు, 26వేల కుటుంబాలు, లక్షల ఎకరాల పంటలు నీటి మునిగా యని గుర్తు చేశారు. వరద బాధితులకు రెండు వేల ఇండ్లు, గోదావరి కర కట్టకు వెయ్యి కోట్లు, ములుగు జిల్లాకు రూ.2.50కోట్లు.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు రూ.2.30కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం అప్పట్లో వాగ్దానం చేశారని తెలిపారు. ఇది జరిగి ఆర్నెలయియినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు.