Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో స్త్రీ, శిశు సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి మంగళవారం నిర్వహిóంచిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 17 జిల్లాల్లో 75 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశా మని తెలిపారు.
ఈ పోస్టులకు 19,812 మంది దరఖాస్తు చేసుకుంటే, 16,763 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. మంగ ళవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 పరీక్షకు 11,274 (56.90 శాతం) మంది, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 పరీక్షకు 11,499 (58. 04 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. ఈ పరీక్షను టీఎస్ పీఎస్సీ చైర్మెన్ బి జనార్ధన్‌రెడ్డితోపాటు సభ్యులు పర్యవేక్షించారని తెలిపారు.
వెబ్సైట్లో సూపర్వైజర్ అభ్యర్థుల హాల్‌టికెట్లు
రాష్ట్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1 పోస్టులకు ఈనెల ఎనిమిదిన రాతపరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్‌టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 181 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్-1 పోస్టులకు గతేడాది ఆగస్టు 27న నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల ఎనిమిదిన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్ష ఉంటుందని వివరించారు. హాల్‌టికెట్ల కోసం www. tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.