Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు టీచర్లు, లెక్చరర్లకు టీపీటీఎల్ఎఫ్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సావిత్రి బాయి ఫూలే స్ఫూర్తితో ప్రయివేట్ టీచర్లు, లెక్చరర్లు హక్కులను సాధించుకోవాలని తెలంగాణ ప్రయివేటు టీచర్లు, లెక్చరర్ల ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) కన్వీనర్ ఎ విజరుకుమార్ పిలుపునిచ్చారు. సావిత్రి బాయి 192వ జయంతి ఉత్సవాలను టీపీటీఎల్ఎఫ్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలోని రెడ్డి ఉమెన్స్ కాలేజ్‌తోపాటు చిక్కడపల్లిలోని న్యూ ఎరా కాలేజ్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ విజరు కుమార్, కాలేజీ ప్రిన్సిపాల్ అచ్యుతా దేవి మాట్లాడుతూ దేశంలో మహిళలకు మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసి చదువు లేని వాళ్ళకు చదువు విలువను చెప్పన గొప్ప వీరవనిత సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. బడి నుండి బహిష్కరణకు గురైన బలహీన వర్గాలకు, దళితులకు పాఠశాల పెట్టి చదువే ఆయుధంగా అందించిందని గుర్తు చేశారు. ఇంగ్లీష్ విద్య ప్రాముఖ్యతను గుర్తించి శూద్రులకు అవసరమంటూ ఆనాడే నొక్కి చెప్పారని అన్నారు. మహిళల విద్య కోసం ఎంతో పాటుపడ్డారనీ, త్యాగాలు చేశారని చెప్పారు. అందుకే ఆమె జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని అన్నారు. వితంతు వివాహాలు జరిపి మూఢాచారాలకు ముగింపు పలకారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, న్యూ ఎరా కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రావణ్, డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావేద్, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు కె విజరు, హైదరాబాద్ నాయకులు నిరంజన్, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.