Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవు తుందనే విశ్వాసంతో జీవితాం తం పోరాడీ.. ఆ దిశగా భావజాలవ్యాప్తిని కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. సోమవారం ఆమె జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్జానాన్నీ, చారిత్రక కృషిని సీఎం స్మరించుకున్నారు. కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందు కోసం సావిత్రీబాయి తన జీవితాన్నే ధారపోసారని పేర్కొన్నారు. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ఆమెకు అందించిన ప్రోత్సాహం మహౌన్నతమైందని వివరించారు. వారి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నివాళలర్పించారు.
అణగారిన వర్గాల కోసం విశేష కృషి మంత్రి గంగుల
సమాజంలో అణగారిని వర్గాల కోసం సావిత్రిబాయి ఫూలే విశేష కృషి చేశారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆమె 192వ జయంతి సందర్భంగా మంత్రి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిభాపూలే ఆశయాలను అనుసరిస్తూ ఆమె స్త్రీ సాధికారత కోసం ఎనలేని కృషి చేసారని స్మరించుకున్నారు.