Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట/ములుగు
విద్య ప్రయివేటీకరణ కాకుండా చూడాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.మంగళవారం ములుగు జిల్లా ములుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోధన ఉపకరణాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంఈఓ గొంది దివాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బోధనో పకరణాలు విద్యా బోధనలకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయివేటుకు దీటుగా సకల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్ఎన్ బోధనోపకరణాల కార్యక్రమం లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని గుర్తించి బహుమతి ప్రధానం చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ లవడియా లక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి ప్రధానోపాధ్యా యులు రాజేశ్వరరావు కాంతారావు ఖలీల్ జ్యోతి మండల కో ఆప్షన్ సభ్యుడు బాబర్ ఎమ్మార్సీలు విష్ణు రజిత బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
టీచర్లు ఐక్య ఉద్యమాలు చేయాలి
ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేసి సాధించుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నూతన డైరీ, క్యాలండర్‌ను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఏండ్లుగా పరిష్కారం కానీ విద్యారంగ సమస్యలు, నాణ్యమైన విద్య కోసం ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. అనంతరం డీఈఓ పాణినీ మాట్లాడుతూ టీఎస్ యూటీఎఫ్ డైరీ.. ఉపాధ్యాయులకు కరదీపిక లాంటిదన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ ములుగు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొప్ప సమ్మారావు, రెడ్డి వాసుదేవరెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల వెంకటస్వామి, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.