Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులాంతర వివాహాలు కులవ్యవస్థ నిర్మూలనకు దోహదం : ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్
నవతెలంగాణ-ముషీరాబాద్
కులాంతర, మతాంతర వివాహాల ప్రోత్సాహం వల్ల సమాజంలో కులవ్యవస్థ నిర్మూ లనకు బాటలు వేసినట్టు అవు తుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయ కుమార్, టీపీఎస్కే రాష్ట్ర కార్యదర్శి జి.రాములు అన్నారు. మంగళవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో కేవీపీఎస్, పీఎన్ఎం ఆధ్వర్యంలో రూప- శేఖర్ ఆదర్శ వివాహం జరిగింది. ఈ వివాహానికి కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.దశరథ్ అధ్యక్షత వహించగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. రూప-శేఖర్ పూలదండలు మార్చుకున్నారు. ప్రమాణ పత్రాలపై సంతకాలు చేశారు.వినయకుమార్, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర, జి.రాములు మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని కులపరమైన కట్టుబాట్లు, అణచివేతలు మనదేశంలోనే ఉండటం వల్ల సాటి మనుషులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారన్నారు. ప్రకృతి సహజసిద్ధంగా ప్రేమలు ఉంటాయని, వాటికి కులమెందుకుని ప్రశ్నించారు. కులాంతర, మతాంతర ఆదర్శ వివాహాలను నేటితరం తప్పక చేసుకోవాలన్నారు. కులాంతర వివాహాలు సామాజిక మార్పునకు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ, సామాజిక కార్యకర్త జగదీష్, వేల్పూరి కామేశ్వర్, కామేశ్వరరావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, కేవీపీఎస్, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.