Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలి : ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చీఫ్ గార్డెనర్ వై సత్యనారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సావిత్రిబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శమని వాణిజ్య పన్నుల శాఖ మాజీ అడిషనల్ కమిషనర్, ఎక్స్ ఐఓఎఫ్ఎస్, ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి సలహాదారులు, చీఫ్ గార్డెనర్ వై సత్యనారాయణ అన్నారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి ఆరో వార్షికోత్సవ సభ, సావిత్రిబాయి ఫూలే 192వ జయంతి వేడుకలు మంగళవారం హైదరాబాద్‌లోని అకాడమిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. వారి నుంచి ఎన్నో విషయాలను, ఒడిదుడుకులు వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలనే అంశాలను నేర్చుకోవడానికి వీలవుతుందని చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సిలబస్‌కు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలని కోరారు. అకాడమి ప్రిన్సిపాల్ కె సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అకాడమి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీష్ కుమార్, సిబ్బంది కోట మురళీకృష్ణ, బి రంజిత్ కుమార్, రాజా, రాజేందర్‌తోపాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.