Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి విజరుసేన్‌రెడ్డి ఇచ్చిన తీర్పును హైకోర్టులో సిట్ సవాలు చేసింది. మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను కొనేందుకు తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని అప్పీల్లో పేర్కొంది. ఆ ఘటనకు చెందిన వీడియో, ఇతర ఆధారాల సీడీలు సీఎంకు ఎలా చేరాయనే సందేహం కొలిక్కి రాలేదనీ, ఇది సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అందువల్ల సింగిల్ జడ్జి తీర్పులో పేర్కొనడం సబబుకాదని చెప్పింది.
సీఎం ప్రతివాది కానప్పుడు, ఆయన వాదనలు వినకుండా, సీఎం గురించి తీర్పులో పేర్కొనడం చట్ట వ్యతిరేకమని తెలిపింది. ఏ కేసులోనైనా నిందితులు దర్యాప్తు సంస్థ ఫలానాది కావాలని కోరే హక్కు ఉండబోదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేసింది. సీబీఐ దర్యాప్తునకు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చెల్లదంది. ఈ అప్పీల్‌పై హైకోర్టు విచారణ చేయనుంది.
మెడికల్ అడ్మిషన్లలో స్పోర్ట్స్ కోటా రద్దు చెల్లదు
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో క్రీడల కోటా సీట్ల కేటాయింపు రద్దు చెల్లదనీ, గతంలో మాదిరిగా స్పోర్ట్స్ కోటాను తిరిగి అమలు చేయాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. మెడికల్ అడ్మిషన్లలో 0.5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ 2020లోని జీవో 2ను సవాల్ చేసిన రిట్‌పై జస్టిస్ అభినందకుమార్ షావిలి, జస్టిస్ పి.కార్తీక్ డివిజన్ బెంచ్ విచారించి తీర్పు చెప్పింది. జీవో 114 ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.
కాంగ్రెస్ ధర్నాకు అనుమతి
సర్పంచ్ల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమాలకు పోలీసులు అనుమతివ్వాలని హైకోర్టు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 2న ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్ దాఖలు చేసిన రిట్‌ను లంచ్‌మోషన్ రూపంలో కోర్టు విచారించింది. 300 మందితో ధర్నా నిర్వహించుకోవడానికి షరతులతో కూడిన అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది. కోవిడ్ నియమ నిబంధనలు అమల్లో ఉంటే అమలు చేయాలని సూచించింది. షరతులు ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోవచ్చునని కూడా స్పష్టం చేసింది.