Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు 'రాష్ట్ర సదస్సు' జరగనుంది. ఈ మేరకు ఆ సమితి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వలీ ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర, కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, సలీం పాషా, రెహ్మాన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సదస్సుకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, అరుణోదయ సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు విమలక్క, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావేత్తలు హాజరవుతారని తెలిపారు.