Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) చైర్మెన్ వై సతీష్‌రెడ్డి అన్నారు. దీనికి మౌలిక వసతుల కల్పన కోసం 'రెడ్కో' కృషిచేస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బుధవారంనాడాయన హైదరాబాద్ దుర్గంచెరువు దగ్గర ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ మెషిన్‌ను పరిశీలించారు. వాటి ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. చార్జింగ్ కేంద్రాల్లో వాహనాల పార్కింగ్, వాహన యాజమానులు సేదదీరేందుకు వసతులు కల్పించాలని సూచించారు. హైదరాబాద్‌లో త్వరలో 150 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సమయం వథా కాకుండా కేవలం 30 నుంచి 45 నిమిషాల్లో కారు చార్జింగ్ పూర్తవుతుందన్నారు. చైర్మెన్ వెంట రెడ్కో ఎలక్ట్రిక్ వాహన విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ, అనిల్ ఉన్నారు.