Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంత్రులు టి హరీశ్ రావు, పి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌కు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్), టిగ్లా, కాంట్రాక్టు లెక్చరర్స్ సంఘం-475 సంఘాల నేతలు బుధవారం హైదరాబాద్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిప్స్ కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, టిగ్లా అధ్యక్షులు మైలారం జంగయ్య, నాయకులు ఇదైత్ అలీ, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం-475 ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, నాయకులు కెపి శోభన్ బాబు, బూర విజయమోహన్, శ్రీనివాస్ రెడ్డి, పోలా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ మంత్రులను కోరగా, త్వరలోనే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారని తెలిపారు.