Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ బుధవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ను కలిశారు. ఏపీలో పార్టీ పటిష్టత తదితర అంశాలపై వారు చర్చించారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షునిగా నియమించడం పట్ల కేసీఆర్కు తోట చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఏపీ నేత చింతల పార్థసారధి పాల్గొన్నారు. బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యేలు జోగు రామన్న, చంటి క్రాంతి కిరణ్, రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తాతా మధు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.