Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఎస్‌కు పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న స్పౌజ్ సమస్యను పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలిసి వినతిప్రతం సమర్పించారు. 317 జీవో అమలు అనంతరం వేర్వేరు జిల్లాలకు కేటాయించిన భార్యాభర్తలైన ఉపాధ్యాయులను ఒకే జిల్లాకు కేటాయించే క్రమంలో మిగిలిపోయిన 13 జిల్లాలకు ఉపాధ్యాయ ఖాళీలను అనుసరించి అవకాశం కల్పించాలని కోరారు. ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, బదిలీలు కల్పించాలని సూచించారు. ఆన్లైన్లో పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు మరో అవకాశం కల్పించాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి తీసుకుని వెంటనే పరిష్కరిస్తామంటూ సీఎస్ స్పష్టమైన హామీనిచ్చారని పేర్కొన్నారు.