Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి షబ్బీర్ అలీ
హైదరాబాద్ : కొత్తగా నియమితులైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే వారం రోజుల్లో రాష్ట్రానికి రానున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. పార్టీ నిర్వహించిన శిక్షణా తరగతులలకు నేతలందరూ హాజరయ్యారని తెలిపారు. సమావేశాలకు అందరూ రావడం అనేది జరిగే పని కాదని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయనీ, ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుందని చెప్పారు. అందరితో చర్చించి పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. కామారెడ్డిలో రైతులు రోజు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే, ప్రభుత్వానికి కొంచెం కూడా చలనం లేదని విమర్శించారు.