Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ జాతీయ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో 'హాత్ సే హాత్ జోడో' యాత్ర ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుందని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ వెల్లడించారు. ఆ యాత్ర ద్వారా స్ఫూర్తిని తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకెళతామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాత్ సే హాత్ యాత్ర నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు థాక్రే రావడం మంచి పరిణామన్నారు. ఆయన అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన నేత అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా పార్టీ నష్టపోతుందనే విషయం తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు అంగీకరించిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ పదాన్ని విస్మరించారని విమర్శించారు. కేసీఆర్ తీరుతో అమరుల ఆత్మ ఘోషిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను తాగుడుకు బానిసలను చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.