Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరంజన్‌రెడ్డికి ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ 'సర్చోటూరామ్' అవార్డును సీఎం కేసీఆర్‌కు ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో రైతు సంఘం ప్రతినిధులు అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత రైతాంగ శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ మహాయజ్ఞం మొదలుపెట్టారని తెలిపారు. మన దేశం తన వనరులను సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ...రైతుల పోరాటానికి తలొగ్గి, నిస్సిగ్గుగా జాతికి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న ఆలోచన మోడీకి తట్టలేదన్నారు. ఆ రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తర్వాత సాయం అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, మూసీ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ చైర్మెన్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు,ఎస్కేఎం సభ్యులు సత్నాం సింగ్ బెహ్రూ, అఖిల భారత సలహాదారులు సుఖ్జిందర్ సింగ్ కాకా, రాచ్ పాల్ సింగ్ ఖల్సా, మీడియా కార్యదర్శి అవతార్ సింగ్ దుండా ఉన్నారు.