Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11న గాంధీ మెడికల్ కాలేజీలో వర్క్ షాప్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగావకాశాలపై ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కానున్నారు. వర్క్‌షాప్‌లో విదేశాల్లో ఆరోగ్య రంగంలో ఉత్తీర్ణులైన నర్సులకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యుకె, జర్మనీ, ఇతర యూరోపియన్ దేశాల్లో నర్సులకు పెద్ద ఎత్తున ఉన్న డిమాండ్ నేపథ్యంలో నిరుద్యోగులైన నర్సులకు ఆ సమాచారాన్ని కచ్చితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయా దేశాల వారీగా ఉన్న అవకాశాలు, భారీగా జీతాలు, నైపుణ్యం కలిగిన వారికి ఉండే అవకాశాలు, అర్హతలు, అర్హతల పరీక్షలు, నియామక ప్రక్రియలు తదితర విషయాలపై నర్సులకు ఉండే సందేహాలను తీర్చనున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి కలిగిన నర్సులకు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని వర్క్ షాప్‌లో కల్పించనున్నారు.