Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల దళిత ఉపాధ్యాయుడు మల్లిఖార్జున్‌ను కులం పేరుతో దూషించి బలవంతంగా గుడికి తీసుకెళ్లి బొట్టు పెట్టించి అవమానించిన మతోన్మాద బీజేపీ, విహెచ్పీ దుండగులను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్)రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్ వెస్లీ, టి స్కైలాబ్ బాబు గురువారం ఒక ప్రకటన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలవంతంగా లాక్కెళ్లి జై శ్రీరాం అనాలనీ, బొట్టు పెట్టుకోవాలని ఒత్తిడి చేయడమేగాక, తీవ్రమైన పరుష పదజాలంతో దూషించారని తెలిపారు. సైన్స్ టీచర్ మూఢత్వాలు ఎందుకు బోధిస్తాడంటూ వారు ప్రశ్నించారు. ఆచార్యదేవోభవ అని గౌరవించుకోవాల్సిన దేశంలో మతోన్మాదులు టీచర్‌పై రౌడీయిజం చేయటం దారుణమని తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలను ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని కోరారు.