Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర గాయాలు
- పోలీసుల అదుపులో నిందితుడు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారి దోపిడీ, ఓ మృతి కేసు విషయమై దర్యాప్తు చేపడుతున్న హైదరాబాద్ మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులపై దుండగుడు దాడి చేశాడు. కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సంచలనం రేపింది. జగద్గిరిగుట్ట సిఐ పి.సైదులు తెలిపిన వివరాల ప్రకారం..
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం దారి దోపిడీ జరిగింది. ఈ ఘటనతో తల్వార్తో దుండగుడు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రధాన నిందితుడైన సర్దార్ కరణ్ సింగ్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండ గురునానక్ కాలనీ (సిక్కుబస్తి)లో ఉన్నాడని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఓటీ కానిస్టేబుళ్లు రాజు, వినరు మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో దర్యాప్తు చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన సర్దార్ కరణ్ సింగ్ వారిపై తల్వార్తో దాడి చేశాడు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట సీఐ పి.సైదులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన రాజు, వినరుని కూకట్పల్లిలోని రాందేవ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మాదా పూర్లోని ఆస్పత్రి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సైబరా బాద్ అడిషనల్ డీసీపీ రవి కుమార్, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ (ఎస్ఓటీ) నారాయణ గౌడ్ ఆస్పత్రికి వెళ్లి కానిస్టేబుళ్లను పరామర్శించారు. సర్దార్ కరణ్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. కానిస్టేబుల్ రాజు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.