Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ- ఖమ్మం
ప్రయివేట్ విద్యుత్ బిల్ కలెక్టర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఎంపీడీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రసాద్ ప్రారంభించారు. ఈ ధర్నానుద్దేశించి జిల్లా కార్యదర్శి కామినేని నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు వై.విక్రమ్, రమ్య, వెంకన్న మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి ఇవ్వాలని, బిల్ కలెక్టర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్లకు ఇస్తున్న అన్ని సౌకర్యాలూ బిల్ కలెక్టర్లకు ఇవ్వాలని కోరారు. ఆన్లైన్ వసూళ్ల ద్వారా తగ్గిపోయిన ఉపాధిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు రూరల్ డివిజన్ కార్యదర్శి ఎన్.సీతయ్య మద్దతు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్‌కి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో బిల్ కలెక్టర్ల జిల్లా అధ్యక్షులు బి. ప్రభాకర్, జి.గురునాథం, సిహెచ్.శ్రీనివాసరావు, పాశం నాగేశ్వరరావు, హరి, కోటేశ్వరరావు, పి.సత్యనారాయణ, దినేష్, భరత్, నరేష్, రహీం, వినోద్ కుమార్, జానీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.